తాత్కాలిక బాస్‌గా కోలెట్ క్రెస్
13 శాతం పతనమైన కంపెనీ షేర్లు
శాన్‌ఫ్రాన్సిస్కో : దిగ్గజ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన గురువారం ప్రకటించారు. సీఈఓ, అధ్యక్ష పదవులతో పాటు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సభ్యత్వం నుంచి కూడా వైదొలిగారు. సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించినట్టు ఎన్విడియా వెల్లడించింది. శాశ్వత సీఈఓ ఎంపిక కోసం అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలించనున్నట్టు తెలిపింది. సంస్థ బోర్డుకు తొలిసారిగా చైర్మె న్‌గా హార్వీ సి. జోన్స్‌ను నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం అమెరికా మార్కెట్లో ఎన్విడియా షేర్లు 13 శాతం కుప్పకూలాయి. హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వెలువడిన కథనాల నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొత్త సారథి కోలెట్ క్రెస్ 2013 సెప్టెంబర్ నుంచి ఎన్విడియా సీఎఫ్‌ఓగా పనిచేస్తున్నారు. కంపెనీ ఆర్థిక కార్యకలాపాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె.. తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.






కామెంట్‌లు (0)