నవతెలంగాణ - హైదరాబాద్ : ఆఫ్రికాలోని జిబూటి నుంచి యెమెన్‌కు సుమారు 350 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది పిల్లలతో సహా 109 మంది మృతి చెందారు. 116 మందికి పైగా గల్లంతయ్యారు. జిబూటిలోని గుహెరే ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 80 మందికి పైగా ఇథియోపియా పౌరులు ప్రాణాలతో బయటపడ్డట్లు సమాచారం. అధికారులు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)