యూత్ ఒలింపిక్స్‌లో చారిత్రక మెడల్
డాకర్ (సెనెగల్) : యూత్ ఒలింపిక్స్‌లో భారత యువ బాక్సర్ అంబేకర్ మీతెయి చరిత్ర సృష్టించాడు. సెనెగల్‌లోని డాకర్‌లో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అంబేకర్.. ఈ ఘనత సాధించిన భారత తొలి బాక్సర్‌గా నిలిచాడు. గురువారం జరిగిన మెన్స్ 50 కేజీల ఫైనల్లో ఐర్లాండ్ బాక్సర్ క్రిస్టియన్ జుబానిపై 3-2తో అంబేకర్ గెలుపొందాడు. 2020 యూత్ ఒలింపిక్స్‌లో శివ థాప సిల్వర్ మెడల్ ప్రదర్శనే భారత్‌కు ఇప్పటివరకు ఉత్తమం. మణిపూర్‌కు చెందిన అంబేకర్.. పటియాలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందాడు. క్వార్టర్‌ఫైనల్లో నమీబియా బాక్సర్‌ను నిలువరించిన అంబేకర్.. సెమీఫైనల్లో కొలంబియా బాక్సర్ జెఫ్రీపై 5-0తో ఏకపక్ష విజయం నమోదు చేశాడు.







కామెంట్‌లు (0)