ఫిట్‌నెస్ పరీక్షలో పాసైన వికెట్ కీపర్
బెంగళూరు : భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఎట్టకేలకు ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గాడు. ఇరానీ ట్రోఫీలో ఆడుతూ పక్కటెముకల కింద భాగంలో కండరాల గాయంతో పంత్ బాధపడిన సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ రెండు వారాలుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సాధన చేస్తున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ సౌకర్యవంతంగా చేసినా.. బీసీసీఐ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఫిట్‌నెస్ పరీక్షలో పాసవలేదు. దీంతో భారత్-ఏ తరఫున మూడో అనధికార టెస్టులో ఆడే అవకాశం కోల్పోయాడు. తాజాగా ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన రిషబ్ పంత్ న్యూజిలాండ్‌కు బయల్దేరనున్నాడు. ఈ నెల 19న భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టుకు రిషబ్ పంత్ అందుబాటులో ఉండనున్నాడు.







కామెంట్‌లు (0)