Magazines

ఫైనల్లో కుర్రాళ్లు

5 గంటల క్రితం

youngsters
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

సెమీస్‌లో అఫ్గాన్‌పై గెలుపు
అండర్‌19 ఆసియా కప్‌

రాణించిన లక్ష్య, ఆర్యవీర్‌, వినీత్‌


అల్‌ అమరత్‌ (ఒమన్‌) : టీమ్‌ ఇండియా కుర్రాళ్లు కుమ్మేశారు. అఫ్గనిస్తాన్‌‌పై అలవోక విజయంతో అండర్‌19 ఆసియా కప్‌ ‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం అల్‌ అమరత్‌‌లో జరిగిన సెమీఫైనల్లో భారత అండర్‌19 ‌జట్టు 8 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్ అండర్‌19 ‌జట్టుపై ఘన విజయం సాధించింది. 228 పరుగుల లక్ష్యాన్ని భారత కుర్రాళ్లు 36.5 ఓవర్లలోనే ఊదేశారు. ఓపెనర్లు లక్ష్య రాయ్‌‌చందని (93, 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), ఆర్యవీర్‌ ‌సెహ్వాగ్‌ (51, 57 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌‌లు) అర్థ సెంచరీలతో తొలి వికెట్‌‌కు 117 పరుగుల అదిరే ఆరంభం అందించారు. వికె వినీత్‌ (57 ‌నాటౌట్‌, 62 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), చౌహాన్‌ (16 ‌నాటౌట్‌) ‌సైతం రాణించంతో మరో 79 బంతులు ఉండగానే కుర్రాళ్లు లాంఛనం ముగించారు. అంతకముందు, తొలుత బ్యాటింగ్‌ ‌చేసిన అఫ్గనిస్తాన్‌ అండర్‌19 ‌జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 227 పరుగులు చేసింది. నోమన్‌ (51, 78 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లు), షా రహిమి (51, 72 బంతుల్లో 2 ఫోర్లు) అర్థ సెంచరీలకు తోడు సోహైల్‌ ‌ఖాన్‌ (36 ‌నాటౌట్‌) ‌రాణించటంతో అఫ్గనిస్తాన్‌ ‌మెరుగైన స్కోరు చేసింది. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌‌పై పాకిస్తాన్‌ ‌కుర్ర జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. శనివారం జరిగే ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్