Magazines

కులం పేరుతో దూషించి, దాడి

1 గంట క్రితం

Verbal abuse
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

బతుకమ్మ వేడుకల్లో దౌర్జన్యం

వికారాబాద్‌ ‌మండలం సర్పన్‌‌పల్లిలో ఘటన

వికారాబాద్ ఎస్‌హెచ్‌ఓకు బాధితుల వినతి

​నవతెలంగాణ–వికారాబాద్ రూరల్

​బతుకమ్మ వేడుకల సందర్భంగా కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వికారాబాద్ మండలం సర్పన్ పల్లి గ్రామానికి చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ బాధితుడు చింతల బాలరాజు వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల18న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు సర్పన్ పల్లి గ్రామంలోని రచ్చకట్ట వద్ద ఎస్సీ (మాదిగ) కులానికి చెందిన మహిళలు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అదే సమయంలో సమీపంలోని హనుమాన్ ఆలయం వద్ద ఇతర కులాలకు చెందిన మహిళలు కూడా బతుకమ్మ ఆడుతున్నారు.


ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన కావాలి రమేష్, మరికొందరు టపాకాయలు పేల్చడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ జరుగుతున్న గొడవను సర్దిచెప్పేందుకు వెళ్లిన వారిపై కావాలి రమేష్, ఆయనతో ఉన్న మరికొందరు కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో చింతల బాలరాజు, చింతల చంద్రశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు కారణమైన ​కావాలి రమేష్, కొత్తకాపు మహేందర్ రెడ్డి, చల్లా రాంరెడ్డి, కావాలి వెంకటేష్, ముష్టి మహేందర్, ముష్టి ప్రవీణ్‌తో పాటు మరికొందరు సహా మొత్తం 15 మందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయడంతో పాటు గ్రామంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్