Magazines

మనుషులంతా ఒక్కటే..

1 గంట క్రితం

All human beings are one.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం


లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జయహో రామానుజ’. సుదర్శ నం ప్రొడక్షన్స్లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిం చారు. అమెరికా నటి జో శర్మ కథానాయికగా, సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించ నున్నారు. ఈ నెల 24న ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు.

నటి, నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ, ‘సమ సమాజం కోసం రామానుజాచార్యులు చేసిన ప్రయత్నం ఏంటి?, ఈ క్రమంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వంటి అంశాలను చూపిస్తున్నాం. ఈ సినిమాలో కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి వంటి మూడు రోల్స్ లోనూ నాకు నటించే అవకాశం రావడం అదృష్టంగా భావి స్తున్నా. రామానుజాచార్యుల జీవితం గురించి మా సినిమా ద్వారా ఇప్పటి తరానికి తెలుస్తుందని నమ్ముతున్నాం’ అని చెప్పారు.

‘చిన్నప్పుడు రామానుజాచార్యుల వారి కథలు చదువుకున్నాను. ఆ తర్వాత కొన్నేళ్లకు పత్రికలకు రామానుజాచార్యుల వారి కథలను రాసి పంపించాను. అప్పుడే ఏదో ఒక రోజు ఆయన జీవిత కథను సినిమాగా రూపొందించాలనే సంకల్పం ఏర్పడింది. అయితే నేనే రామానుజా చార్యుల వారిగా నటిస్తానని ఊహించలేదు. కులం లేదు, మతం లేదు మనుషులంతా ఒక్కటే అని చాటిన మహనీయుడు ఆయన. నేను ఈ పాత్ర వేషధారణలో తిరుమలకు వెళ్లినప్పుడు అక్కడ భక్తులు నాకు నమస్కరించడం నా జీవితంలో మర్చిపోలేని ఘటన’ అని ప్రొడ్యూసర్, హీరో లయన్ సాయి వెంకట్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్