Magazines

అన్ని వర్గాల ప్రేక్ష‍కులు కనెక్ట్‌ అవుతారు

1 గంట క్రితం

Audiences from all sections will connect with it.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత, పంపిణీదారుడు ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న సినిమా ‘సమ్మర్ హాలిడేస్’. శ్రీకర్ దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ను మేకర్స్‌ నిర్వహించారు. డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ, ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఈ దీపావళి పండక్కి ఒక మంచి ఎంటర్ టైనర్ ను మీకు అందిస్తున్నాం. ఇది పిల్లల సినిమా అంటున్నారు గానీ కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రమిది’ అని తెలిపారు.

‘అక్టోబర్ లోనే మా సినిమా రిలీజ్ కు కొన్ని డేట్స్ అనుకున్నాం. కానీ కుదరలేదు. నవంబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాం. రిలీజ్ డేట్స్ మార్చుకోవడం మాకూ ఇబ్బందిగానే ఉంది. కానీ మా సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తారు. సినిమా చూస్తున్నప్పుడు పెద్దలకు వాళ్ల బాల్యం గుర్తొస్తుంది. వాళ్ల టీనేజ్ లో సమ్మర్ హాలీడేస్ లో వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినప్పుడు ఎలాంటి జ్ఞాపకాలు ఉండేవో గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ దీపావళికి మా సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాం. చిన్న సినిమాల మనుగడ బాగుండాలంటే ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచేందుకు అనుమతి ఇవ్వకూడదని నా అభిప్రాయం’ అని ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని చెప్పారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్