ప్రొడ్యూసర్ బన్నీ వాస్, డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం’. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 11న రిలీజ్ కానుంది. గురువారం ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ మేకర్స్ నిర్వహించారు.
డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ,‘మా మూవీ టీజర్ మీకు నచ్చడం హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇడుపు కాయితం అనేది ఒక జంట విడిపోవడానికి రాసుకునే పత్రం అను కుంటాం. కానీ అదే జంట విడిపోయిన తర్వాత కొత్త జీవితం ప్రారం భించడానికి ఒక సర్టిఫికెట్ లాగ ఇడుపుకాయితాన్ని భావించాలి అనేది నా ఉద్దేశం’ అని అన్నారు.
‘నేను ఫస్ట్ హాఫ్ చూశాను. డైరెక్టర్ వంశీరెడ్డి కథ ఎంత బాగా చెప్పాడో, అంతే బాగా సినిమా తెరకెక్కించాడు. ఇది బ్యూటిఫుల్ స్టోరీ. సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కథను రిలేట్ చేసుకుంటారు’ అని ప్రొడ్యూసర్ తబిత సుకుమార్ చెప్పారు.
ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ,‘ఇది చాలా మంచి సినిమా. కొత్తగా పెళ్లయిన జంట మీ అత్త మామతో కలిసి థియేటర్ కు రండి. ఈ సినిమాలో మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలను చూపిస్తూ అక్కడక్కడా నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ డైరెక్టర్ ఆకట్టు కునేలా తెరకెక్కించారు. మాటలు మన ఇంట్లో మాట్లాడుకున్నట్లే ఉంటాయి. ఎక్కడా సినిమాటిక్ గా ఉండదు. దర్శకుడిగా వంశీరెడ్డికి మంచి పేరొస్తుంది. మీ టికెట్ డబ్బులు మాత్రం వృథా కావు. ప్రియదర్శి, నాగదుర్గ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి ఈ కథ తీసుకొచ్చి మాతో చేయించారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కూడా ఆయనకే వెళ్తుంది. నేను సినిమా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను’ అని అన్నారు.
నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది
5 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 12, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)