Magazines

దొందూ దొందే...

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

పంచాయ‌తీ నుంచి పార్ల‌మెంటు దాకా ప్ర‌తీ ఐదేండ్ల‌కోసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం మ‌న దేశంలో ఆన‌వాయితీ. ఆ ఎన్నిక‌లన్నింటిలో ఎవ‌రో ఒక‌రే గెల‌వ‌టం ప‌రిపాటి. గెలిచిన వారు పాల‌న‌లో పాలు పంచుకుంటే.. ఓడిన వారు ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాటానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా మారుతోంది. ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వ‌ట‌మే ప‌ర‌మావ‌ధిగా తంతు కొన‌సాగుతోంది. ఈ ప‌రిస్థితి ఇంకా శృతిమించి పాకాన ప‌డుతోంది. పొరుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలే ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. గెలుపోట‌ముల సంగ‌తి ప‌క్క‌న పెడితే... అస‌లు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థుల‌ను నామినేష‌న్లే వేయ‌కుండా అడ్డుకుంటున్న ప‌రిస్థితి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నాయి. నామినేష‌న్లు వేయ‌టానికి వ‌చ్చిన వారిపై దాడి చేయ‌టం, నామినేష‌న్ ప‌త్రాల‌ను చించేయ‌టం, ఎవ‌రైన ధైర్యంగా ముందుకొస్తే హెచ్చ‌రించ‌టం, బెదిరించ‌టం ఆ రాష్ట్రంలో ష‌రా మామూలైపోయాయి. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఇంచుమించు అక్క‌డి అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి. అధికార పార్టీ ఎందుకిలా చేస్తోంద‌ని అడిగితే... ఇప్పుడు వీళ్లు చేశార‌ని మీరంటున్నారు.. కానీ వాళ్లు (ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్షం) అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇదే ప‌రిస్థ‌తి కొన‌సాగింది. అప్పుడు ఫ్యాను పార్టీ వాళ్లు చేసిందే.. ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్లు చేస్తున్నారు.. అంతే తేడా.. దొందూ దొందే.. అంటూ పెద‌వి విరుస్తున్నారు సామాన్యులు. - బి.వి.య‌న్‌.ప‌ద్మ‌రాజు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్