Magazines

ఉక్రెయిన్‌తో ఘర్షణకు చెక్

2 గంటల క్రితం

conflict with Ukraine
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 2 నిమిషాల చదవడం

పుతిన్ మాస్టర్ ప్లాన్

ట్రంప్, జిన్‌పింగ్‌లతో త్రైపాక్షిక భేటీకి ప్రతిపాదన!

ఉక్రెయిన్ - రష్యా మధ్య 
భీకర పోరు జరుగున్న సమయంలో కీలక పరిణామం


మాస్కో : ఉక్రెయిన్‌తో వివాదం గురించి చర్చించేందుకు, మాస్కోకు అనుకూలమైన శాంతి ఒప్పందాన్ని కుదర్చడమే లక్ష్యంగా వచ్చే నెలలో (నవంబర్‌లో) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌లతో త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించినట్టు యూఎస్‌కు చెందిన అంతర్జాతీయ వార్తాపత్రిక తన నివేదికలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మెరుగుపడుతున్న సంబంధాలను సద్వినియోగం చేసుకునేందుకు పుతిన్ చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రతిపాదన అని తెలిపింది. అయితే ఈ చర్య ఉక్రెయిన్‌లోనూ, అమెరికా ఈయూ మిత్రదేశాల్లోనూ ఆందోళనలను రేకెత్తించిందని వెల్లడించింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని స్పష్టం చేసింది.'అక్టోబర్ 9న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో జరిపిన టెలిఫోన్ సంభాషణలో పుతిన్ తొలుత త్రైపాక్షిక సమావేశం ఆలోచనను లేవనెత్తారు.

ఆ సంభాషణ సమయంలోనే రష్యా డీజిల్ ఇంధనాన్ని అమెరికా కొనుగోలు చేయడానికి, ప్రపంచ మార్కెట్లలో దాని పంపిణీని సులభతరం చేయడానికి అనుమతించే ఒప్పందం కుదిరింది. ఈ త్రైపాక్షిక సమావేశం జరిగే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ ఈ శిఖరాగ్ర సమావేశానికి అధికారికంగా అంగీకరించనప్పటికీ, యుద్ధాన్ని పరిష్కరించాలనే కోరిక దృష్ట్యా పుతిన్ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించవచ్చు. దక్షిణ చైనాలోని టెక్ హబ్ అయిన షెన్‌జెన్‌లో నవంబర్ 18, 19 తేదీలలో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఏపీఈసీ) శిఖరాగ్ర సమావేశంతో పాటుగా ఈ త్రైపాక్షిక చర్చలను కూడా నిర్వహించాలని క్రెమ్లిన్ సూచించింది. ట్రంప్ ఈ భేటీలో పాల్గొనడానికి అంగీకరిస్తే తాము అభ్యంతరం చెప్పబోమని చైనా అధికారులు సంకేతాలు ఇచ్చారు' అని అంతర్జాతీయ వార్తాపత్రిక తన నివేదికలో వెల్లడించింది.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగింపు చర్చలో గొప్ప పురోగతి : ట్రంప్

మరోవైపు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను ముగించేందుకు జరుగుతున్న చర్చలు గొప్ప పురోగతి సాధిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాస్కో పట్ల తమ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌత్య విధానాన్ని సమర్థించుకున్నారు. రెండేండ్ల క్రితం మెరుగైన ఒప్పందం కుదర్చడంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విఫలమయ్యారని ఆరోపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు.

'ఆ ప్రయోజనాలకు పొందడమే జెలెన్‌స్కీ ముఖ్య ఉద్దేశం'

'యుద్ధంలో ఉన్న ఈ రెండు దేశాల (ఉక్రెయిన్- రష్యా) మధ్య ఒప్పందం కుదర్చడానికి తాను అనుసరిస్తున్న వ్యూహం చాలా సరళమైనది. దౌత్య ప్రక్రియ గొప్ప పురోగతి సాధిస్తోందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్