Magazines

మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన తాడిచెర్ల సర్పంచ్‌

8 గంటల క్రితం

Minister Sridhar Babu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

తాడిచెర్ల గ్రామ పరిధిలోగల శాత్రజ్ పల్లిలో ఈ నెల 10న అర్ధరాత్రి దాదాపు 347 నివాసిత ఇండ్లను బుల్లోజర్లతో కూల్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గ్రామ సర్పంచ్ బండి స్వామి, బాధితులు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు.


ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు నష్టపరిహారం అందించాలని మంత్రిని కోరారు. శార్రాజ్ పల్లిలో వ్యవసాయ భూములు ఉన్నందున, వ్యవసాయ పనులకు, నివాస అవసరాల కోసం, పశువుల సంరక్షణ కోసం తమ సొంత ఖర్చులతో గృహాలు, పశువుల కొట్టాలు నిర్మించుకుని, గత కొంతకాలంగా వినియోగించుకుంటున్నామని తెలిపారు.


అయితే ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి కూల్చివేశారనీ, అడ్డుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కట్టుక్ను ఇండ్లను తెల్లారేసరికి నేలమట్టం చేశారని వాపోయారు. ఈ చర్యలతో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని విన్నవించారు. వెంటనే తమరి చొరవతో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్