ముంబయి : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ... కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మేనల్లుడు, సినీనటుడు ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నందుకు అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లాలని ఇప్పటికే ఎఫ్ఆర్ఆర్ఓ నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా ... ముంబయిలోని విదేశీయుల ప్రాంతీయ కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్వో) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదాను ఎందుకు రద్దు చేయకూడదో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. దీనిపై ఇమ్రాన్‌ఖాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. భారత్‌ను విడిచి వెళ్లాలంటూ గతంలో జారీ చేసిన నోటీసును బాంబే హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ సవాలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ను విడిచి వెళ్లాలంటూ ఎఫ్ఆర్ఆర్ఓ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ ... ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 17న బాంబే హైకోర్టును ఆశ్రయించారు. భారత్‌ను విడిచి వెళ్లాలన్న ఆదేశాన్ని రద్దు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 10 న ముంబయిలో జరిగిన కాక్రోచ్ పార్టీ నిరసనలో ఇమ్రాన్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు. ఈ పరిణామాల అనంతరం అక్టోబర్ 14 న ఎఫ్ఆర్ఆర్ఓ ఇమ్రాన్ ఖాన్‌కు భారత్‌ను విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇమ్రాన్ అమెరికా పౌరుడని, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025 నిబంధనలను ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది.
ఇమ్రాన్ ఖాన్ కు మళ్లీ నోటీసులు ..!
4 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)