Magazines

క్రేజీ ఫన్ ఎంటర్‌టైనర్

52 నిమిషాల క్రితం

entertainer
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘రోమియో జూలియట్’. భార్గవ్ మాచర్ల రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ సమర్పిస్తుండగా, నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘సారీ బేబీ..’ సాంగ్ లాంచ్ చేశారు. హీరో హర్షిత్ మాట్లాడుతూ,‘దర్శకుడు భార్గవ్ ఈ కథను చాలా ఎంటర్‌టైనింగ్‌గా ప్రజెంట్ చేశాడు. ఇలాంటి క్యారెక్టర్‌ను తెలుగు సినిమాలో చూసి ఉండరు. లవ్ అనేది చాలా పవర్‌ఫుల్. సైలెంట్‌గా ఉండే మనిషి కూడా వైలెంట్‌గా మారుతుంటాడు.

ఇందులో అన్ని క్యారెక్టర్లు క్రేజీగా ఉంటాయి’ అని అన్నారు. ‘ఇది అందరి బయోపిక్. మనందరి జీవితంలో ఎక్కడో ఒకచోట కనెక్ట్ అయ్యే ఎమోషన్‌ను తీసుకుని సినిమాగా చేశాం. ఇది హిలేరియస్ ఫన్ రైడ్‌లా ఉంటుంది. రిలేషన్‌షిప్స్‌పై సోషల్ సెటైర్‌తో పాటు మంచి డ్రామా కూడా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని డైరెక్టర్ భార్గవ్ మాచర్ల చెప్పారు. ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయికృష్ణ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ భరణ్ మాట్లాడుతూ, ‘మేము నిర్మించని సినిమా కాకుండా బయట సినిమాని ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నాం. ఇది మాకు చాలా స్పెషల్. అలాగే మయూరి మూవీస్ ద్వారా ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నాం. ఇది యూత్‌ఫుల్ మూవీ. చాలా రిలేటబుల్‌గా, ఫన్‌గా ఉంటుంది. ఇది ప్రస్తుత జనరేషన్‌పై మంచి హిలేరియస్ సినిమా’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్