రామ్ పోతినేని హీరోగా, దర్శకుడిగా రెండు బాధ్యతలను నిర్వహిస్తూ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నవిషయం తెలిసిందే. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రితేశ్ దేశ్‌ముఖ్ ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ‘ఏక్ విలన్’, ‘రైడ్ 2’తో పాటు ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రాజా శివాజీ’ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులని అలరించారు.
తొలిసారిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథలోని నియో-నాయర్ వరల్డ్ కి మరింత బలాన్ని చేకూర్చేలా నటీనటులు, సాంకేతిక బృందాన్ని రామ్ పోతినేని ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఓ కీలక పాత్ర కోసం రితేశ్ దేశ్‌ముఖ్‌ని తీసుకున్నారు.
సినిమా కథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో రితేశ్ దేశ్‌ముఖ్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో ఆయన పాల్గొన్నారు. చిత్ర బృందం తాజాగా షూటింగ్ లొకేషన్‌లో తీసిన వీడియోను విడుదల చేసింది. సినిమాలోని భారీ సెట్‌ను ఈ వీడియోలో చూపించారు. వీడియోలో రితేశ్ దేశ్‌ముఖ్ సెట్‌లోకి అడుగుపెడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. రామ్ పోతినేని నటిస్తున్న 23వ సినిమా ఇది. దీనికి సినిమాటోగ్రఫీ: తిరునవుక్కరసు, సంగీతం: సామ్ సీఎస్, ఫైట్స్: పీటర్ హెయిన్, విక్రమ్ మోర్, కెవిన్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్.చ
రామ్ సినిమాలో కీలక పాత్ర
4 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)