Magazines

భక్తి భావాన్ని నింపే 'ఓ ఎల్లమ్మ'

4 గంటల క్రితం

O Ellamma
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

తిరువీర్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నచిత్రం 'భగవంతుడు'. ఈ సినిమాలో కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాత రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాత. జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు రాబోతోంది. సోమవారం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'ఓ ఎల్లమ్మ' పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఎస్. కృష్ణ ప్రసాద్ డివైన్ ట్యూన్ తో కంపోజ్ చేయగా అడ్డుల జంగిరెడ్డి పాడారు. ఈ పాటకు డైరెక్టర్ జి.జి.విహారి లిరిక్స్ రాయడం విశేషం.

'ఎల్లమ్మ అంటే ఎవరనుకున్నరు? సూర్యవంశ రాజులింట రేణుకమ్మ పుట్టెరా, దుర్గమ్మే వరమిచ్చిన ఆదిశక్తి అంశరా, అగ్గిలోంచి పుట్టినట్టి అయోనిజ తల్లిరా...' అంటూ మనసునిండా భక్తిభావం నింపేలా సాగుతుందీ పాట. వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ అధిరే అభి, బలగం సంజయ్, హర్షిణి, రవీందర్ రెడ్డి, మైమ్ మధు, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి యాక్షన్: రామ్ కిషన్, రాబిన్ సుబ్బు, పాటలు: చంద్రబోస్, డా. గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్,జి.జి. విహారి, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, సంగీతం: కె.పి., ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, లైన్ ప్రొడ్యూసర్: గౌతమ్ ఊడుగుల.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్